16
Advtisement
Plasement 2

???????? ?????? ???????? ? ????? - ???? ?????????? ?????? ????????


ఓ పవనాత్మజ ఓ ఘనుడా
బాపు బాపనగా పరిగితిగా ।

ఓ హనుమంతుడ ఉదయాచల ని-
ర్వాహక నిజ సర్వ ప్రబలా ।
దేహము మోచిన తెగువకు నిటువలె
సాహస మిటువలె చాటితిగా ॥

ఓ రవి గ్రహణ ఓదనుజాంతక
మారులేక మతి మలసితిగా ।
దారుణపు వినతా తనయాదులు
గారవింప నిటు కలిగితిగా ॥

ఓ దశముఖ హర ఓ వేంకటపతి-
పాదసరోరుహ పాలకుడా ।
ఈ దేహముతో ఇన్నిలోకములు
నీదేహమెక్క నిలిచితిగా ॥