16
Advtisement
Plasement 2

???????? ?????? ?????? ?????? - ???? ?????????? ?????? ????????


శోభనమే శోభనమే
వైభవముల పావన మూర్తికి ॥

అరుదుగ మును నరకాసురుడు ।
సిరులతో జెరలు దెచ్చిన సతుల ।
పరువపు వయసుల బదారు వేలను ।
సొరిది బెండ్లాడిన సుముఖునికి ॥

చెందిన వేడుక శిశుపాలుడు ।
అంది పెండ్లాడగ నవగళించి ।
విందువలెనె తా విచ్చేసి రుకుమిణి ।
సందడి బెండ్లాడిన సరసునుకి ॥

దేవదానవుల ధీరతను ।
దావతిపడి వార్థి దరుపగను ।
శ్రీ వనితామణి జెలగి పెండ్లాడిన ।
శ్రీ వేంకటగిరి శ్రీనిధికి ॥